సుప్రీంకోర్టు నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు: రావుల
టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెల్లడించిన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావుల మాట్లాడారు. ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెగేదాకా లాగొద్దని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారని రావుల ఆరోపించారు.